హైదరాబాద్: సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బహు భాషా చిత్రం 'పుష్ప'లో నటిస్తున్నారు. తాజాగా బన్ని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మాస్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ బర్త్‌డే కానుకగా అల్లు అర్జున్ చేయబోయే తర్వాత చిత్రంపైనా ఓ స్పష్టత వచ్చేసింది. ఆయన తన 21వ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయనున్నారు.
గత కొంతకాలంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్ని నటిస్తారని టాక్ వినిపించింది. తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా 'ఐకాన్: కనబడుట లేదు' టైటిల్ పోస్టర్‌ను శ్రీ వెంకంటేశ్వర క్రియేషన్స్ అభిమానులతో పంచుకుంది. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఇది కూడా బహు భాషా చిత్రంగా రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పనులు పూర్తి కాగానే.. వేణు 'ఐకాన్'కు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది.
Source: https://www.eenadu.net/
Source: https://www.eenadu.net/
Post a Comment
Thank U For ur Comments