ఎడిటర్ నోట్ : ప్రపంచం ఇప్పుడు కోవిడ్ -19 వైరస్ గుప్పిట చిక్కుకొని ఉంది. సమాజంలో చాలా మంది తీవ్ర ముప్పులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు హైజీన్ కిట్స్‌ని అందిస్తున్న హెల్పేజ్ ఇండియాకు మైక్రోసాఫ్ట్ న్యూస్ సహకారం అందిస్తోంది. ఈ సంస్థ మరింత ఎక్కువ మందికి సాయం చేసేందుకు వీలుగా మీరూ సహకారం అందించవచ్చు. విరాళం ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. మీరు హెల్పేజ్ ఇండియా సైట్‌కి మళ్లింపబడుతారు.
ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలు.. ఏపీలో కరోనా లెక్కల స్వరూపాన్నే మార్చివేశాయి. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత ఏపీలో పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇవాళ ఒక్కరోజే ఇప్పటి వరకు 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కి చేరింది.
కొత్తగా ఇవాళ కర్నూల్‌లో 18, నెల్లూరులో 8, పశ్చిమ గోదావరి లో 5, కడప లో 4, కృష్ణ, ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు నమోదయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఐతే కర్నూలులో భారీగా కేసులు బయటపడుతుండడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఆదివారం ఒక్క రోజే 52 కేసులు నమోదవగా.. మరో 50 మందికి టెస్టులు నిర్వహించారు. వారిలో 32 మంది నెగెటివ్ వచ్చింది.
మరో 18 మంది కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74కి చేరింది.
ఒక్క జిల్లాలోనే ఏకంగా అన్ని కేసులు నమోదవడంతో.. అక్కడ కోవిడ్-19 తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ ప్రకటన
కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా సూచనలను పాటించండి. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన సూచనలను కూడా మీరు చదవొచ్చు. సహాయం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన +91 -11-23978046 నంబరుకు ఫోన్ చేయొచ్చు లేకుంటే ncov2019@gmail.comకి మెయిల్ చేయొచ్చు.
© News18 తెలుగు ద్వారా అందించబడింది
Post a Comment
Thank U For ur Comments