లండన్‌ : కరోనా వైరస్‌ బారిన పడిన బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌(55) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూకు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆదివారం లండన్ ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరానని బోరిస్‌ ఓ వీడియో కూడా విడుదల చేశారు.

Coronavirus Britain PM Boris Johnson Moved To ICU - Sakshi

అయితే సోమవారం మాత్ర వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ప్రధాని ఆసుపత్రిలో చేరడంతో యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రభుత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక బ్రిటన్‌లో కరోనా కేసులు సంఖ్య 51,608 కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 5,373 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 13,46,990 మందికి కరోనా సోకగా, 74,702 మంది మృతి చెందారు. 

© Sakshi ద్వారా అందించబడింది

Post a Comment

Thank U For ur Comments

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top