50 ఏళ్లనాటి స్కూలు.. 9వందల మంది విద్యార్థులు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. మరమ్మతుల కోసం ఆ పాఠశాల హెడ్మాస్టర్ స్థానిక నేతలను ఆశ్రయించారు. నిధులు మంజూరు చేయమని కోరారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి మాజీ క్రికెటర్…మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ స్కూలుకు 76 లక్షల గ్రాంటును ఇచ్చారు. దీంతో ఆ పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో స్వర్ణమయి సస్మల్ శిక్షా నికేతన్ ప్రస్తుత పరిస్థితి.
ఈ స్కూలు కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమానులు. తమ స్కూలు దుస్థితి గురించి వాళ్లు ఎంతమందికి చెప్పుకొన్నా ఏమీ ప్రయోజనం కనిపించలేదు. దాంతో చివరకు తమకు ఏమైనా సాయం చేయగలడేమోనని తమ అభిమాన క్రికెటర్‌కు లేఖ రాశారు. రాజ్యసభ ఎంపీ అయిన సచిన్… తన ఎంపీలాడ్ పథకం ద్వారా రూ. 76 లక్షలను ఆ స్కూలు అభివృద్ధికి కేటాయించారు. ఆ నిధులు గత ఆర్థిక సంవత్సరంలో స్కూలుకు అందాయి.
దాంతో సచిన్‌కు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదంటున్నారు ఆ స్కూలు టీచర్లు, విద్యార్థులు. రెండేళ్ల క్రితం స్థానిక సీపీఐ ఎంపీ ప్రబోధ్ పాండాను కలిసి ఆర్థిక సాయం కోరినా.. ప్రయోజనం ఏమీ కనిపించలేదు. చివరకు సచిన్ జోక్యంతోనే స్కూలుకు నిధులోచ్చాయి.
Post a Comment
Thank U For ur Comments