ఆపరేషన్‌ కుకూన్‌'పై విజయకుమార్‌

చెన్నై, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు, కర్నాటక, కేరళ సరిహద్దుల్లోని అటవీ ప్రాం తాల్లో 20ఏళ్లు దాగి, గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు అక్రమంగా రవాణా చేసిన వీరప్పన పోలీసు, అటవీశాఖలకు చెందిన 180 మందిని హతమార్చాడు. 200కు పైగా ఏనుగులను పొట్టన బెట్టుకున్నాడు. మూడు రాషా్ట్రల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. వీరప్పన్‌ను పట్టుకునేందుకు 2003లో టాస్క్‌ఫోర్స్‌ అధినేతగా ఐపీఎస్‌ అధికారి కె.విజయకుమార్‌ను అప్పటి జయ ప్రభుత్వం నియమించింది. వీరప్పనను పట్టుకునేందుకు 'ఆపరేషన కుకూన'ను విజయకుమార్‌ అమలు చేశారు. అందులో భాగంగా వెల్లదురై అనే కానిస్టేబుల్‌ను వీరప్పన ముఠాలో సహాయకుడిగా చేర్పించారు. వెల్లదురై కొంతకాలానికి వీరప్పనకు కుడిభుజంగా మారాడు. ఆ సమయంలో వీరప్పన కంటిచూపు మందగించింది. కంటిచూపు బాగుంటేనే అడవి సామ్రాజ్యాన్ని కాపాడుకోగలరంటూ వెల్లదురై వీరప్పనకు చెప్పాడు. ఆ మేరకు 2004 అక్టోబర్‌ 10న వీరప్పనను అడవి నుండి వెలుపలికి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమైంది. వెల్లదురై ఆ వివరాలను విజయకుమార్‌కు చేరవేశాడు. ఆ రోజు న అడవి నుంచి వీరప్పన్‌ను ధర్మపురి జిల్లా పాప్పారపట్టి గ్రామానికి తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసుల అంబులెన్సులో వీరప్పన అతడి అనుచరులు ఎక్కారు. అది కొంత దూరం ప్రయాణించాక వెల్లదురైతో పా తటు, డ్రైవర్‌గా నటించిన శరవణన ఆ వాహనానికి తాళాలు వేసి అడవిలోకి పారిపోయారు. అప్పటికే అక్కడ మాటువేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వీరప్పన, అతడి అనుచరులపై తూటాల వర్షం కురిపించారు. తూటాలకు వీరప్పన కుప్పకూలగా, తీవ్రంగా గాయపడిన అనుచరులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించారు. అత్యంత ఆసక్తికరమైన ఈ వివరాలను పూసగుచ్చినట్లుగా విజయకుమార్‌ తన 1000 పేజీల పుస్తకంలో పొందుపర్చారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top