అమ్మా..! చనిపోతున్నాను
అతనొచ్చేస్తున్నాడు… మమ్మల్ని చంపడానికే వస్తున్నాడు… నేను చనిపోతున్నాను..
ఐ లవ్యూ అమ్మా… బై…
ఓ కొడుకు చనిపోయే ముందు క్షణాల్లో తన తల్లికి పంపిన ఆఖరి మెసేజ్ ఇది. ఇక ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది.. ? తల్లడిల్లిపోయిన ఆ మాతృహృదయం ఇప్పడు గుండెలవిసేలా విలపిస్తోంది.
అమెరికాలో ఓ ముఫ్ఫయ్యేళ్ళ తీవ్రవాది విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 50 మందిలో ఎడీ జస్టిస్ ఒకడు. నైట్ క్లబ్ లో ఆగంతకుడు ఫైరింగ్ స్టార్ట్ చేయగానే జస్టిస్ వెళ్ళి ఓ బాత్ రూమ్ లో దాక్కున్నాడు. అప్పటికే జస్టిస్ తన తల్లికి మెసేజ్ లు పంపుతున్నాడు. ఫోన్ లో మాట్టాడితే ఎక్కడ వినిపస్తుందోనన్న భయంతో టెక్ట్స్ మెసేజ్ లు చేస్తున్నాడు. ఆ ఉగ్రవాది అసలు బాత్ రూమ్ లొకి తొంగి చూడడని , తాను బతికి బయటపడతానని చివర వరకూ అనుకున్నాడు జస్టిస్. కానీ విధి వేరే విధంగా ఉంది.
అమ్మా.. పోలీసులకు పోన్ చెయ్యి… అతనొచ్చేస్తున్నాడు..నన్ను చంపేస్తాడు.. నేను చనిపోతాను.. అమ్మా త్వరగా .. పోలీస్ కు ఫోన్ చెయ్యి.. ఇలా ..ఒకరొకరిగా చంపుకుంటూ వస్తున్న ఆ ఉన్మాది ఒమర్ మతీన్ ఆ బాత్ రూమ్ ను సమీపిస్తున్న వేళ జస్టిస్ మెసేజ్ లు పంపుతూనే ఉన్నాడు. అప్పటికే అర్థరాత్రి రెండున్నర గంటల సమయం.. ఇంట్లో ఉన్న ఆ తల్లికి ఏ చెయ్యాలో తెలీలేదు.. వెంటనే పోలీస్ ను అలర్ట్ చేసింది. ఏ క్లబ్ లో ఉన్నావని మెసేజ్ చేసింది.. అలా పోలీస్ ను పంపింది.. ఆర్తనాదాలు చేస్తూ ఇంట్లోకి బయటికి పరుగెత్తింది.. నాన్నా, జాగ్రత్త, అతనెవరు, టెర్రరిస్టా.. అంటూ మెసేజ్ లు పంపుతూనే ఉంది. తన తల్లికి మెసేజ్ చేస్తూనే ఉగ్రవాది బులెట్లకు నేలకొరిగాడు జస్టిస్. చనిపోడానికి ఒక్క రెండు నిమిషాల ముందు మాత్రం అతను తల్లి చేసిన ఫోన్ ఎత్తాడు, అప్పటికే రణగొణధ్వని.. ఏమీ వినపడడం లేదు, అమ్మా లవ్యూ.. అన్న మాటలే వినపడ్డాయని తల్లి మైనా జస్టిస్ ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ కి ఏడుస్తూ చెప్పింది.
Post a Comment
Thank U For ur Comments