కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారారు. ఇన్నాళ్లూ ఉన్న అధికారిక వాహనాన్ని మార్చి… కొత్త కారు కొనడం ఇప్పుడు వివాదాస్పదమైంది. కాన్వాయ్ లో కారు కొత్తది తీసుకోవడం వింత కాకపోయినా… పాత కారు మార్చినందుకు కారణమే ఇప్పుడు రచ్చ క్రియేట్ చేస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త కారు కొన్నారు. నిన్న మొన్నటి వరకు వాడిన అదే బ్రాండ్ కారు .. మళ్లీ కొత్తది తీసుకున్నారు. సేమ్ కలర్.. సేమ్ వెహికల్.. అలాంటప్పుడు కారు మార్చడం ఎందుకంటారా..? పాత కారుపై కాకి వాలింది. అందుకే దాన్ని పక్కనపెట్టేసి కొత్త కారు కొన్నారు. ఈనెల 2న సిద్ధరామయ్య కారు పార్క్ చేసి ఉన్న సమయంలో దానిపై ఓ కాకి వచ్చి వాలింది. సిబ్బంది వచ్చి దాన్ని తరమాలని చూసినా.. అది అక్కడి నుంచి కదల్లేదు. 10 నిమిషాల పాటు కారుపైనే ఉండిపోయింది. దీంతో ఈ వీడియో అక్కడి న్యూస్ చానల్లో చక్కర్లు కొట్టింది. అపశకునం అంటూ కొన్ని చానళ్లలో డిస్కషన్ కూడా నడిపారు.
కాకి వాలడాన్ని నెగిటివ్ సెంటిమెంట్ గా భావించిన సిద్ధరామయ్య .. వారం తిరిగేలోగానే కొత్త కారును బుక్ చేశారు. 35 లక్షలు పెట్టి టొయోటా ఫార్చునర్ ను కొన్నారు. సిద్ధరామయ్య కాంట్రవర్శీలు కొత్తేం కాదు. 50 లక్షలకు పైగా ఖరీదైన వాచ్ ఇష్యూలోనూ ఆయన ఇబ్బంది పడ్డారు.
Post a Comment
Thank U For ur Comments