చిన్న చిన్న అరోగ్య సమస్యలు వస్తే.. పలు మందులు వాడేయటం అలవాటే. జలుబు.. దగ్గు వస్తే.. విక్స్ యాక్షన్ 500.. కోరెక్స్ లాంటివి వైద్యులు చెప్పకున్నా కొనేస్తుంటారు. అయితే.. ఇలాంటి మందుల్ని వాడకూడదని.. ఇవన్నీ ప్రమాణాలకు తగ్గట్లు లేవంటూ తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో ఒకింత షాక్ తినే పరిస్థితి.
ఈ బ్రాండ్ల విషయంలోనే ఇలా ఉంటే.. తాజాగా మరికొన్ని బ్రాండ్ల పైనా కేంద్రం నిషేధం విధించిందన్న వార్తలు గుప్పు మంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఉన్న మరికొన్ని పేర్లు చూస్తే.. ఇవన్నీ రెగ్యులర్ గా వినియోగించే మందులు కావటం గమనార్హం. అలాంటి జాబితాలో ఉన్న మందులు చూస్తే.. క్రోసిన్.. డీ కోల్డ్ టోటల్.. డోలో..డీకాఫ్ మందుల్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
స్థిర మోతాదు కలయిక ఉన్న వందలాది మందులపై తాజాగా నిషేధం విధించింది. ఇలాంటి మందులు 350 వరకు ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా అలాంటి మందుల వివరాల్ని పూర్తిగా బయటపెట్టాలని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా తాజాగా రాజ్యసభలో డిమాండ్ చేశారు. కేంద్రం నిషేధించిన మందుల జాబితా బయటకు విడుదల చేయటం ద్వారా.. ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆయన చెప్పారు. మరి.. బ్యాన్ చేసిన మందుల బ్రాండ్లు బయటకు వస్తాయా?
Post a Comment
Thank U For ur Comments