పెద్దవారికి ఒక సైకాలజీ క్లాస్ జరుగుతోంది
మూర్తి గారు సైకాలజీ చెబుతూ ఒక గేమ్ ఆడదాము అన్నారు . అందరూ ఉత్సాహం చూపారు . ఒకరిని బోర్డ్ దగ్గరకు రమ్మన్నారు . మాధురి వచ్చింది .
" మీకు బాగా నచ్చిన 20 మంది పేర్లు రాయండి " అన్నారు మూర్తి గారు
ఒక 10 పేర్లు వరకూ గబగబా రాసింది . కొంచెం ఆలోచించి ఇంకో 10 పేర్లు రాసింది ఆమె . మిగిలిన వారిని వారి వద్ద ఉన్న పుస్తకాలలో రాసుకోమన్నారు మూర్తి గారు
.
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఒక 5 పేర్లు తీసెయ్యండి "
తన స్నేహితుల పేర్లను తీసేసింది అందరూ అలాగే చేశారు
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో 5 పేర్లు తీసెయ్యండి "
తన బంధువులలో తోటికోడళ్ళు , అన్నలూ చెల్లెళ్ళూ వరుసల వారిని తొలగించింది

మాధురి ఏమి చెయ్యాలో తెలియని స్థితి లోకి వెళ్ళింది . అత్తా మామల పేర్లను , బావల పేర్లనూ ఆడపడుచుల పేర్లనూ తొలగించింది
.
ఇంక మిగిలినవి --- అమ్మ నాన్న మాధురి , భర్త , కొడుకు
.
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో 2 పేర్లు తీసెయ్యండి "
ఒక్క నిముషం తలవిదిలించింది
అమ్మ నాన్నల పేర్లు తొలగించింది
మిగిలినవి తను , భర్త , కొడుకు
.
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో పేరు తీసెయ్యండి "
.
మాధురి మనసు తల్లడిల్లి పోతోంది . ....... చివరకు తొలగించింది కొడుకు పేరు . కన్నీళ్లు ఉబికి వస్తుండగా వెళ్లి సీట్ లో కూర్చుంది .
.
.
.
మూర్తి గారు అడిగారు " మీరు ఎందుకు కొడుకు కన్నా , అమ్మా నాన్నల కన్నా భర్తకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ? "
.
.
క్లాసులో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు అందరి మనసులలో ఉత్కంఠ
.
" నా తల్లి తండ్రులు నాకన్నా ముందుగానే కాలం చేస్తారు . అది వాస్తవం . నా కొడుకు ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్లి పోతాడు . ఇన్ని సంవత్సరాలూ నాతో కలిసి ఉండి నేను లేకపోతే ఎ పనీ చేసుకోలేని వ్యక్తి నా భర్త . అందుకనే ఆయనే నా మొదటి బంధం ---- చివరి వరకూ ఉండే బంధం "
.
.
అందరూ లేచి నిలబడి ఆమెను తమ హర్షద్వానాలతో అభినందించారు
మగవారిని వారు రాసినది చదవమన్నారు మూర్తి గారు .
ఆశ్చర్యం వారు వారి భార్యల పేరు మాత్రమె రాశారు
.
జీవితంలో అనేక రకాల బంధాలు ఏర్పడుతుంటాయి . వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి .
పరిమితులు లేని బంధం భార్యా భర్తల అనుబంధం . ఒప్పుకుంటారా ?

Post a Comment
Thank U For ur Comments