మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న నటిగా - నిర్మాతగా వివిధ పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. రీసెంట్ గా లక్ష్మీ హీరోయిన్ గా నటించిన 'దొంగాట' సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత హీరోయిన్ రోల్స్ ను సెలెక్ట్ చేసుకోని లక్ష్మీ ప్రసన్న ను తన తండ్రి మోహన్ బాబు పిలిచి మరీ తిట్టారట. దానికి కారణం ఆమె హీరోయిన్ గా నటించనందుకు కాదు.. ఓ సినిమాలో చేసిన పాత్ర గురించి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూర్ టాకీస్' సినిమాలో లక్ష్మీ ప్రసన్న చిన్న రోల్ లో నటించింది.

హీరో దగ్గర డబ్బులు కొట్టేసే ఆ రోల్ లో ఒక్క సీన్ చేసిన లక్ష్మీ ఆ సీన్ లో హీరోని సెడ్యూస్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు అలాంటి బీగ్రేడ్ సినిమాలో నువ్వెందుకు గెస్ట్ రోల్ చేసావు.. చేసినా.. అలాంటి సీన్ లో ఎందుకు కనిపించావని లక్ష్మీ మంచు కి పెద్ద క్లాస్ తీసుకున్నారట. ప్రవీణ్ సత్తారు మీద ఉన్న గౌరవంతోనే ఆ పని చేసానని ఇంకెప్పుడు అలా చేయనని సమస్యను పరిష్కరించుకుందట. 

Post a Comment

Thank U For ur Comments

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top