సింగర్‌గా మారిన సీతమ్మ!
ఈ మధ్య కాలంలో స్టార్స్ కేవలం తెరపై కనబడడమే కాకుండా, తమ తమ సినిమాల్లో పాటలు పాడుతూ సింగర్స్ గా కూడా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే హీరోలలో పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, నారా రోహిత్ లాంటి వారు తమ తమ సినిమాల్లో పాటలు పాడాడు. అలాగే హీరోయిన్స్ లో మమత మోహన్ దాస్, శృతి హాసన్, రాశీ ఖన్నా తదితరులు తమ సినిమాలలో పాటలు పాడుకున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్స్ జాబితాలో మరో హీరోయిన్ కూడా జాయిన్ కానుంది. తను ఎవరో కాదు అచ్చ తెలుగమ్మాయి అయిన అంజలి కావడం విశేషం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన అంజలి నుంచి వస్తున్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చిత్రాంగద. పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో అంజలి ఓ పాట కూడా పాడింది. నిన్ననే చెన్నై లో మ్యూజిక్ డైరెక్టర్ సెల్వ గణేష్ నేతౄఎత్వంలో తన సాంగ్ ని రికార్డ్ చేసింది. మార్చిలో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసి సమ్మర్‌కి సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.