మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మి!
‘గుంటూరు టాకీస్’ విడుదలకు ముందే బోలెడెంత క్రేజ్ సంపాదించుకుంది హాట్ భామ రష్మి గౌతమ్. సినిమా టిజర్స్‌లో రేష్మి రెచ్చిపోయి నటించింది. ఇక ప్రమోషన్స్‌లోనూ అమ్మడు ఏ మాత్రం తీసిపోని విధంగా హాట్ హాట్‌గా కనువిందు చేసింది. ఇక ఈ క్రేజ్‌తోనే ఇప్పుడు అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక తన పాత్ర కొన్ని నిమిషాలే ఉన్నా మహేష్ బాబు సినిమా కావడంతో అమ్మడు వెంటనే ఒప్పేసుకుందని వార్తలు షికారు చేస్తున్నాయి.