యంగ్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ!
బుల్లితెరపై హాట్ క్రేజ్ సంపాందించుకుని వెండితెరపై అడుగుపెట్టిన తార అనసూయ ‘క్షణం’ సినిమాతో ప్రశంసలు అందుకుంది. సినిమా హిట్ అయ్యి అభినందలు వస్తున్నా మరో విధంగా తనపై వస్తోన్న పుకార్లు బాధపెడుతున్నాయని అంటోంది. ఇది వరకే తన డ్రెస్సింగ్ పై కామెంట్ చేసే వారికి ఘాటుగా సమాధానం చెప్పిన అమ్మడు ఈ సారి ఓ యువ హీరోతో చక్కర్లు కొడుతోందని టాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై ఇలాంటి లేని పోని వార్తలు రాస్తే మాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది.
మరోవైపు అనసూయతో చనువుగా ఉంటోన్న ఆ యువ హీరో అనసూయతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించడంతో అతడికి కూడా వాయించినట్లు తెలుస్తోంది. అవకాశాలు ఇప్పించే నెపంతో అతను దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే అనసూయ ఇచ్చిన రియాక్షన్‌తో ఆ యువ హీరో మతి పోయిందని సమాచారం.