వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌ను బ్యాన్ చేశారు. అమ్మో ఇంకేముంది... నా సోషల్ మీడియా మిత్రులు ఏమైపోవాలి అని తెగకంగారు పడిపోకండి. బ్యాన్ చేసింది ఇండియాలో కాదు. సౌదీ అరేబియాలో. వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌ను బ్యాన్ చేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఇవి మాత్రమే కాదు, చాట్ యాప్స్ నుంచి చేసే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌ను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉందట. టెలికామ్ కంపెనీల రెగ్యులర్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కంటే ఆన్‌లైన్ కాలింగ్, చాటింగ్‌కే సౌదీ ప్రజలు మొగ్గుచూపుతున్నారట.
దీంతో టెలికామ్ రంగం తీవ్ర నష్టాల బాటలో నడుస్తోంది. ఫేస్‌బుక్, వాట్సాప్ టెలికామ్ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని... అందుకే గతంలో వాట్సాప్‌ను బ్యాన్ చేశారని అరబ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పుడు వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్ మెసెంజర్, వైబర్ యాప్స్‌ను తాజాగా నిషేధించడం జరిగింది.
Post a Comment
Thank U For ur Comments