శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడి ఒక ఇంటి ఆవరణలో పనివాళ్లు గార్డెన్‌ను బాగు చేస్తుండగా వాళ్లను ఆశ్చర్యపరుస్తూ ఓ పొడవైనా పెట్టె దొరికింది. దానిపైన అద్దాలు ఉండటంతో లోపల ఏముందో చూడటానికి ప్రయత్నిస్తూ అద్దంపై ఉన్న దుమ్మును తుడిచారు. లోపల ఒక పాప చేతిలో రోజా పువ్వు పట్టుకుని ఉంది. ఇంకా బతికే ఉందన్నట్టు చక్కగా ఉందామె. ఆమెకు 3 సంవత్సరాలు ఉంటాయి. 145 ఏళ్ల క్రితం ఆమె సమాధిని రసాయనాలతో శరీరం చెక్కుచెదరకుండా భద్రపరిచారు. అయితే అసలు విషయానికి వెళితే.. ఆ సమాధి దొరికిన ప్రాంతం ఒకప్పుడు ఓ 30 ఏళ్లపాటు శ్మశాన వాటికగా వాడబడింది. కానీ 1890లో ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో సమాధి చేసే కార్యక్రమాలను నిషేదించారు. చలా సమాధులను వేరే ప్రాంతాలకు తరలించారు కూడా. కాకపోతే అక్కడక్కడ కొన్ని మాత్రం అలాగే మిగిలి ఉండిపోయాయి. అందోలో ఒకటే ఇప్పుడు దొరికిన సమాధి.
Post a Comment
Thank U For ur Comments