car


బ్రెజిల్ దేశంలో ఒక కోటీశ్వరుడు…తన One Million Dollar ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!! నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నేను చనిపోయిన తరవాత కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!! అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ..ఈయన ఒక పెద్ద అవివేకి అని… One Million Dollar కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!! మీడియా మరియు మిగిలిన ప్రజలు అతనికి చాలా తిట్టారు.అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని.. చాలామంది చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి ఉన్నారు..!! పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి పెట్టారు..!! ఆ తతంగాన్నిఅందరూ ఉత్సుకతతో మరియు ఆత్రుతతో చూస్తూ ఉన్నారు..!! కారుని పాతిపెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి..ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!! అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా.. ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..?? మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!! దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా..అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!! అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!

"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!! దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!! ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! నిజమే..!! కానీ మీరు మాత్రం… వెలకట్టలేని… మీ(మన) గుండె… కళ్ళు… ఊపిరితిత్తులు.. మూత్రపిండాలు..etc.. ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి..!! ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా..వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి..!! వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని..ఆలోచన కాని లేదు..!! ఎందుకు..?? కారు పోయినా..డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!!  మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?? వాటికి విలువ కట్టగలమా..??   మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేము..!! కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు..!! మనం అంతా ఎందుకు వారికి సాయం  య్యకూడదు..?? ఆలోచించండి..!! అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!! మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడాను..!! "

(( ఎంత అద్భుతమైన సందేశం కదా  సోషల్ మీడియా సౌజన్యంతో))


Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top