హైదరాబాద్: సోమవారం అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హష్మీ దారుణహత్యకు గురయ్యాడు. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్ వద్ద హష్మీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హష్మీ అదృశ్యంపై కుటుంబసభ్యులు నిన్న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు లింగంపల్లి వద్ద హష్మీ మృతదేహాన్ని గుర్తించారు. హష్మీని దుండగులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. సెల్‌ఫోన్, నగదు, బంగారు గొలుసు కోసమే హష్మీని హత్య చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
Related Posts
Karnataka not the IT hub of India?
Bengaluru: KARNATAKA may be dubbed the 'IT hub' of the country but when it comes to e-governance [...]
Hello movie Teaser: Akhil
Click Here [...]
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment
Thank U For ur Comments
EmoticonClick to see the code!
To insert emoticon you must added at least one space before the code.