నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కథ ఒకటవ శతాబ్దానికి చెందిన శాతవాహన రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తయారైంది. ప్రస్తుతం మొరాకోలో జరుగుతోన్న ఈ షూటింగ్ కు సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అది కూడా బాలయ్య గురించి.

ఉదయం 6 గంటల నుండే చిత్ర యూనిట్ మొత్తం రెడీగా ఉంటోందట. సూర్యుడి తొలి కిరణాలతో అందంగా మెరిసిపోయే మొరాకో దేశంలోని అద్భుత లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నారట. బాలయ్య కూడా అందరి కన్నా ముందే షూటింగ్ కు రెడీ అయిపోతున్నారట. మొత్తంగా బాలయ్య ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నారని టాక్.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top