వరంగల్: జిల్లాలోని సెంట్రల్ జైలు ఖైదీ ఉప్పల సూరీ పోలీసుల ఎస్కార్ట్‌ల కళ్లు కప్పి పరారయ్యాడు. ఈ ఘటన జనగామ దగ్గర జరిగింది. సూరిపై పోలీసులు కాల్పులు జరిపారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. జనగామ దగ్గర యశ్వంతపూర్ సమీపంలో టాయిలెట్ వస్తోందని బస్సును ఆపారు. ఎస్కార్ట్‌తో సహా దిగిన సూరి అక్కడి నుంచి పరుగులు తీశారు.
సూరీ తప్పించుకున్న వెంటనే ఒక రౌండ్ పోలీసులు కాల్పులు జరిపారు..అయినా సూరి లెక్కచేయకుండా పరారయ్యారు. అయితే అదేసమయంలో వరంగల్ సెంట్రల్ జైలులో ఓ కార్యక్రమం ఇనాగురేషన్‌కు వచ్చిన హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కాన్వాయ్ అదే దారిలో వెళ్లడంతో పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. సూరి తప్పించుకోవడంతో అతనికోసం రెండు బృందాలు ప్రస్తుతం గాలిస్తున్నాయి. సూరీని త్వరలోనే పట్టుకుంటామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.
Post a Comment
Thank U For ur Comments