బీజింగ్: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. అంటే ఇదే మరి. రోజూ చూసే వస్తువుల రూపురేఖలు మారిపోయి సరికొత్త రూపాల్లో దర్శనం ఇస్తే ఎలా ఉంటుందో మరి కొద్ది రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రియులు చూడబోతున్నారు. అందేంటనుకుంటున్నారా..? బెండ్ చేసి.. చేతికి బ్రాస్‌లెట్‌లా ధరించుకని, ఇష్టమైన ఆకృతుల్లో ఉంచుకోగల స్మార్ట్‌ఫోన్‌ను చైనా కంపెనీ తయారు చేస్తోంది. అన్నీ కుదిరితే ఈ యేడాదే లక్ష స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుందట. చోంగ్‌క్యుంగ్‌లోని మోక్జీ గ్రూప్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్లకు రూపకర్త. దీని ధర 51వేల 547 రూపాయలు ఉంటుందట. ఇష్టం వచ్చిన ఆకృతుల్లోకి మార్చుకోగలగడమే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. బ్లాక్, వైట్ రూపాల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఫోన్ స్క్రీన్‌ను గ్రాఫేన్ టెక్నాలజీతో తయారు చేస్తారట. దీనిలో కార్బన్ ఆటమ్స్‌ను ప్రత్యేక పాటర్న్స్‌లో అరేంజ్ చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను వంచినా స్క్రీన్ సహకరిస్తుందని చెబుతున్నారు.
Post a Comment
Thank U For ur Comments