హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి కొంతకాలంగా తాను మాట్లాడకపోవడానికి ఆయన అభిమానులే కారణమని, చిరంజీవిని సైతం వారు అవమానిస్తున్నందునే తాను మౌనంగా ఉంటూ వచ్చానని సినీ నటుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఇటీవల పత్రికలకు, మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూల్లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడనని ఆయన చెప్పిన విషయం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన 'ఒక మనసు' ఆడియో వేడుకలో ఆయన కొంతమంది మెగా ఫ్యాన్స్ తీరును తప్పు పడుతూ మాట్లాడారు. 'ఒక మనసు' చిత్రం ద్వారా నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా పరిచయం అవుతుండడం విశేషం! ఈ వేడుకలో సైతం అభిమానులు 'పవర్‌స్టార్.. పవర్‌స్టార్' అని గోల చేస్తుంటే మైకు అందుకున్న అల్లు అర్జున్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ''మీరు 'పవర్‌స్టార్' అని కేకలు పెడుతున్నప్పుడల్లా నేను మాట్లాడకుండా వెళ్లిపోతున్నాను. దానికి కారణం పవర్‌స్టార్ గారి కొంతమంది అభిమానులు. కొంతమంది గ్రూప్‌కింద ఏర్పడి 'పవర్‌స్టార్.. పవర్‌స్టార్' అని అరిచీ, అరిచీ ఇబ్బంది పెడుతున్నారు. దర్శకులు, సినిమాకు సంబంధించిన వాళ్లు మాట్లాడుతుంటే మీరు 'పవర్‌స్టార్.. పవర్‌స్టార్' అని అరుస్తుండటం తప్పు బ్రదర్. అభిమానులుగా మీరు వాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం అవతలి హీరోలకూ, వాళ్ల అభిమానులకూ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. దీనివల్ల మనం పెరుగుతామే కానీ తగ్గం. చిరంజీవిగారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన్ని ఇంకో మాట మాట్లాడనీయకుండా 'పవర్‌స్టార్' అని అరుస్తుండటం తప్పు. అది నాకు నచ్చలేదు. నేను హర్టయ్యాను.
అసలు మనకింత ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసిచ్చింది చిరంజీవిగారు. ఆయనలాంటి స్టేచర్ ఉన్న వ్యక్తిని అవమానించడం నాకు నచ్చలేదు. అప్పుడు ఫిక్సయ్యా. మీరెంతగా అరిచినా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గురించి చెప్పకూడదని. అది నా తప్పుకాదు. అది మీరు చేసిన క్రియేషన్. నేనెన్ని వందలసార్లు పవర్‌స్టార్ ఇష్టమని చెప్పలేదు! మళ్లీ ఇవాళ కొత్తగా చెప్పాలా? చిరంజీవిగారి తర్వాత నన్నంత బాగా సపోర్ట్ చేసింది పవన్ కల్యాణ్ గారే. ఆయన గురించి మాట్లాడ్డానికి నాకెప్పుడూ ఇబ్బందిలేదు. కాంట్రవర్సీ వస్తుందని ఎవాయిడ్ చేశానే కానీ, ఎవాయిడ్ చేయడం వల్ల ఇంత కాంట్రవర్సీ వస్తుందని ఊహించలేదు. ఈ టైమ్‌లో నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 'వీడు మూడు హిట్లు కొట్టేసరికి మాట్లాడ్డం లేదు' అని మీరు అపార్థం చేసుకుంటారని నాకు తెలుసు. మీరు తప్పుచేస్తున్నారని చెప్పడానికి నామీద నేను వేసుకున్న నెగటివ్ ఫోర్స్ ఇది. ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నేను మిమ్మల్ని హర్ట్ చేసివుంటాను. కానీ దానికంటే వందరెట్లు మీరు నన్ను హర్ట్ చేశారు, ఆ విషయం మీక్కూడా తెలుసు. నన్నిష్టపడే అభిమానులకూ, పవర్‌స్టార్ అభిమానులకూ ఓ రిక్వెస్ట్. దయచేసి సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ ఆపండి. మేమంతా ఓ కుటుంబం. ఆ కామెంట్లు మమ్మల్ని బాగా బాధపెడుతున్నాయి. అనవసరంగా మీడియా ముందు మనం తగ్గాం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. కచ్చితంగా మీరు నన్నపార్థం చేసుకోరు. మంచిగా బిహేవ్ చేస్తారని ఆశిస్తున్నా.

Post a Comment
Thank U For ur Comments