యంగ్ హీరో రామ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న 'జనతా గ్యారేజ్' ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అనే ఉపశీర్షికతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హీరో రామ్ కూడా సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ...'జనతాగ్యారేజ్' రిలీజ్ తర్వాత సినిమాకి క్యాప్షన్... ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును అనేలా మారాలని కోరుకుంటున్నాను.. అంటూ పోస్ట్ చేశాడు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top