సూపర్‌స్టార్‌ రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిలో బాలీవుడ్‌ స్టార్‌హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా చేరిపోయారు. 'కబాలి' మొదటి రోజు ఫస్ట్‌ షో చూడాలనుందన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. టీజర్‌ చూసి అక్షయ్‌ ఈ మాట అన్నారు. ఇటీవలే విడుదల చేసిన 'కబాలి' టీజర్‌కు విపరీతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా నిలిచి కోటి 60 లక్షల మంది 'కబాలి' టీజర్‌ని వీక్షించారంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థ్ధమవుతుంది. 

రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న '2.0' చిత్రంలో విలన్‌గా నటిస్తున్న అక్షయ్‌కుమార్‌ తన పోర్షన్ షూటింగ్‌ నిమిత్తం చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా '2.0' నిర్మాణ సంస్థ లైకా ప్రతినిధులు అక్షయ్‌కి 'కబాలి' టీజర్‌ చూపించగా, చెన్నైలో ఫస్ట్‌ షో చూడాల్సిందేనని ఉత్సాహంగా చెప్పారు. అంతకుముందు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మరో చిత్రం 'ఎనక్కు ఇన్నొరు పేరు ఇరుక్కు' ఆడియోను అక్షయ్‌ కుమార్‌ విడుదల చేశారు. ప్రైవేటుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు జీవీ ప్రకాష్‌, ఆనంది, దర్శకుడు శామ్‌ ఆంటోన్ తదితరుల సమక్షంలో అక్షయ్‌ పాటల సీడీలను ఆవిష్కరించారు. తన అభిమాన నటుడి చేతుల మీదుగా తన సినిమా ఆడియో విడుదల కావడంతో జీవీ ప్రకాష్‌ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 

ఈ చిత్రానికి జీవీయే స్వరాలు కూడా అందించాడు. సీనియర్‌ నటి నిరోషా, శరవణన్, కరుణాస్‌ కీలకపాత్రలు పోషించారు. షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top