మనం తినే బ్రెడ్‌లోనే కాదు.. మన చుట్టూ ఉండే అనేక పదార్థాలలో కేన్సర్‌ కారకాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. అవేంటో చూద్దాం.


ఒక్క గ్రేప్స్‌లోనే 15 రకాల పురుగుమందులుంటున్నాయి. యాపిల్‌ రంగు మారకుండా ఉండటానికి ప్రమాదకరమైన 'డైఫెనిలమైన్‌' అనే కెమికల్‌ను కోటింగ్‌గా వాడుతున్నారు. ఆలూచిప్స్‌ను ఫ్రై చేసినపుడు ఎక్రిలమైడ్‌ అనే రసాయనం విడుదలవుతుంది. సాఫ్ట్‌డ్రింక్స్‌లో ఏస్‌సల్ఫేమ్‌-కె అనే కృత్రిమ చక్కెరను వాడుతున్నారు. ఇవన్నీ కేన్సర్‌ కారకాలే.



హైడ్రోజినేటెడ్‌ ఆయిల్స్‌

పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు తయారుచేసే విటమిన్లు, సప్లిమెంట్ల మాత్రల తయారీలో ఏం వాడతారో తెలుసా? విషపూరితమైన కెమికల్స్‌తో పాటు హానికరమైన హైడ్రోజినేటెడ్‌ ఆయిల్స్‌ను వాడుతున్నారు. హైడ్రోజినేటెడ్‌ ఆయిల్స్‌ను ప్రాసెస్డ్‌ ఫుడ్‌, బేకింగ్‌ ఫుడ్‌ తయారీలో ఉపయోగిస్తారు. వెజిటబుల్‌ ఆయిల్‌ను హైడ్రోజన్‌తో చర్యనొందించడం ద్వారా ఈ ఆయిల్‌ను తయారుచేస్తారు. దీనివల్ల మంచి ఫ్యాట్‌ (పాలీఅన్‌సాచురే టెడ్‌ ఫ్యాట్‌) తగ్గిపోతుంది. ట్రాన్స్‌ఫ్యాట్‌ క్రియేట్‌ అవుతుంది. ఈ ఆయిల్‌ వల్ల గుండె, నరాలకు సంబంధించిన సమస్యలు, డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది.



కృత్రిమ రంగులు

వినియోగదారులను ఆకర్షించడానికి ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో కృత్రిమ రంగులను వాడుతుంటారు. కొన్నిరకాల కృత్రిమ రంగులు విషపూరితమైన కోల్‌టార్‌ నుంచి తయారవుతాయి. ఈ పదార్థాన్ని ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌, రూఫింగ్‌ పెయింట్స్‌లో వాడతారు. కృత్రిమ రంగులను వాడటం వల్ల ఆటిజం, ఏడిహెచ్‌డి, కేన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.



టైటానియం ఆక్సైడ్‌

ఈ రసాయన పదార్థాన్ని విటమిన్ల తయారీలోనూ, కాస్మెటిక్స్‌ తయారీలోనూ ఫిల్లర్‌గా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే కార్సినోజిన్స్‌ వల్ల కేన్సర్‌, అలర్జీలు, అటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది.



కరాజీనన్‌

మిల్క్‌ చాక్లెట్‌, ఇతర పాల ఉత్పత్తులు, సూప్స్‌, ఐస్‌క్రీమ్‌, పెరుగు వంటి ఆహార ఉత్పత్తుల్లో ఈ రసాయనాన్ని వాడుతున్నారు. దీనివల్ల కేన్సర్‌, జీర్ణసంబంధ వ్యాధులు, వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



లెడ్‌, ఫ్లోరైడ్‌, ఆర్సెనిక్‌

ప్రొటీన్‌ షేక్స్‌, కాస్మెటిక్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, కన్వెన్షనల్‌ ఫుడ్స్‌, సప్లిమెంట్లలో టాక్సిన్స్‌, హెవీ మెటల్స్‌ ఉంటాయి. డిటాక్స్‌ ప్రొడక్ట్‌లలో సైతం హై లెవెల్‌ అల్యూమినియం ఉంటోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న హెర్బ్‌ల్లో సైతం అల్యూమినియం, లెడ్‌, ఆర్సెనిక్‌ వంటి హానికరమైన రసాయనాలుంటున్నాయి. ఎంతో ఆరోగ్యం అని అనుకుంటున్న గ్రీన్‌ టీలోనూ ఫ్లోరైడ్‌ అధికస్థాయిలో ఉంటోంది. చికెన్‌ ఆకట్టుకునే విధంగా కనిపించడం కోసం ఆర్సెనిక్‌ను వాడుతున్నారు.



ఎక్రిలమైడ్స్‌

ఆహారపదార్థాలను రోస్ట్‌ చేసినపుడు, గ్రిల్డ్‌ లేక ఫ్రై చేసినపుడు అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్రిలమైడ్స్‌ తయారవుతాయి. 120 డిగ్రీల సెంటీగ్రెడ్‌ వద్ద ఫ్రై చేసే పొటాటో చిప్స్‌లో ఎక్రిలమైడ్‌ ఉంటుంది. ఎక్రిలమైడ్స్‌ సాధారణంగా ప్లాంట్‌ బేస్డ్‌ ఫుడ్స్‌లో కనిపిస్తాయి. ఒవేరియన్‌ కేన్సర్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌కు కారణమయ్యే కేన్సరస్‌ న్యూరోటాక్సిక్‌ కెమికల్‌ ఇందులో ఉంటుంది. ఎక్రిలమైడ్‌ వల్ల జరిగే హానిని నివారించడంలో విటమిన్‌ సి బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.



సోడియం బెంజోయెట్‌ అండ్‌ బిహెచ్‌టి

సాఫ్ట్‌డ్రింక్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ తాజాగా ఉండటానికి, వాటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా ఉండటానికి సోడియం బెంజోయెట్‌, బిహెచ్‌టి ప్రిజర్వేటివ్స్‌ను వాడుతుంటారు. ఈ రెండూ హ్యూమన్‌ డీఎన్‌ఏను డ్యామేజ్‌ చేయడమే కాకుండా గ్యాస్ట్రిక్‌ సమస్యలు తెచ్చిపెడతాయి. బ్లాడర్‌ కేన్సర్‌కు కారణమవుతాయి. కాలేయ జబ్బులు వచ్చే ఆస్కారముంది.



క్యుప్రిక్‌ సల్ఫేట్‌, బోరిక్‌ యాసిడ్‌

మార్కెట్లో చాలా బాగా అమ్ముడవుతున్న సప్లిమెంట్లలో ఈ రెండూ ఉంటున్నాయి. ఇవి డీఎన్‌ఏ డ్యామేజ్‌ చేయడమే కాకుండా పుట్టుకతో లోపాలకు కారణమవుతాయి. తలనొప్పి, డిప్రెషన్‌ను తెచ్చిపెడుతున్నాయి.



సోడియం నైట్రేట్‌

ఇది చాలా ప్రమాదకరమైన ఆహార సంకలనం. కేన్సర్‌కు కారణమవుతుంది. మాంసం, ప్రాసెస్డ్‌ మీట్‌ పాడవకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్‌గా దీన్ని ఉపయోగిస్తున్నారు.



ఒలెస్ట్రా

ఇది 'నాన్‌-ఫ్యాట్‌' ఫ్యాట్‌. పొటాటో చిప్స్‌లో ఉంటుంది. దీన్ని ఫేక్‌ ఫ్యాట్‌ అని కూడా పిలుస్తారు. ఇమ్యునిటీ పవర్‌ను తగ్గించడమే కాకుండా కేన్సర్‌ నుంచి కాపాడే విటమిన్‌ ఎ, డి, ఇ, కెలను కట్టడి చేస్తుంది.



ప్రొపైల్‌ గల్లేట్‌

ప్రిజర్వేటివ్‌గా వాడతారు. పొటాటో స్టిక్స్‌, చూయింగ్‌ గమ్స్‌, రెడీ టు మేక్‌ సూప్‌ మిక్స్‌ల్లో వాడతారు. ఈ ఉత్పత్తులను రెగ్యులర్‌గా తీసుకుంటే కోలన్‌, స్టమక్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.



మోనోసోడియం గ్లుటమేట్‌

చైనీస్‌ సాల్ట్‌ అని పిలుస్తారు. ఇందులోనూ ప్రమాదరకమైన ఫుడ్‌ అడిటివ్స్‌ ఉన్నాయి. ఈ ఎమైనోయాసిడ్‌ను ఫ్లేవర్‌ సలాడ్స్‌, సూప్స్‌, చైనీస్‌ ఫుడ్‌ తయారీలోనూ వాడతారు. ప్రతి రెస్టారెంట్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లోనూ దీని వినియోగం ఉంది. దీన్ని ఎలుకలపై ప్రయోగించి చూడగా ఒక్క డోస్‌తోనే హైపోథాలమస్‌ దెబ్బతిన్నట్లు వెల్లడయింది. మనుషుల్లో అయితే దీని ప్రభావం 3 నుంచి 5 రెట్లు ఇంకా ఎక్కువగా ఉంటుందట.



అస్పర్‌టేమ్‌

కృత్రిమ తీపి పదార్థం ఇది. అధికంగా తీసుకోవడం వల్ల లింపోమా, లుకేమియా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలోకి ప్రవేశించగానే తలనొప్పి, చూపు మందగించడం, పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌, మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.



ఏస్‌సల్ఫేమ్‌-కె
కొత్త రకం స్వీట్‌నర్‌ ఇది. సాఫ్ట్‌డ్రింక్స్‌లోనూ, బేక్డ్‌ ఫుడ్స్‌లోనూ వాడుతున్నారు. సాధారణ షుగర్‌తో పోల్చితే 200 రెట్లు ఎక్కువ తియ్యదనాన్ని అందిస్తుంది. అయితే కేన్సర్‌ కారకం. థైరాయిడ్‌ గ్రంథిపైన ప్రభావం చూపిస్తుంది.

పొటాషియం బ్రోమేట్‌
బ్రెడ్‌ మెత్తగా రావడం కోసం, సాగే గుణం పెరగడం కోసం బ్రెడ్‌ తయారీలో పొటాషియం బ్రోమేట్‌ను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇది బేకింగ్‌ సమయాన్ని తగ్గిస్తుంది. సమయంతోపాటు డబ్బు ఆదా అవుతుండటంతో కంపెనీలు ఈ రసాయనం వాడకంపై ఆసక్తి చూపుతున్నాయి. చాలా దేశాల్లో బ్రెడ్‌ తయారీలో పొటాషియం బ్రోమేట్‌ వాడకంపై నిషేదం ఉంది. పొటాషింయ బ్రోమేట్‌లో కార్సినోజెన్‌ ఉన్నట్లుగా పరిశోధనల్లో తేలింది. న్యూఢిల్లీలో సేకరించిన 84 శాతం బ్రెడ్‌ నమూనాల్లో పొటాషియం బ్రోమేట్‌ ఉన్నట్లుగా సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అధ్యయనంలో వెల్లడయింది. బ్రెడ్‌ను సరియైున సమయం పాటు బేకింగ్‌ చేయకపోతే క్రిస్టల్స్‌ ఫామ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

ఆపిల్స్‌

కోల్ట్‌స్టోరేజ్‌లో నిలువ చేసినపుడు ఆపిల్స్‌ రంగు మారకుండా ఉండటానికి 'డైఫెనిలమైన్‌' అనే కెమికల్‌ను కోటింగ్‌గా వాడతారు. డీపీఏగా పిలిచే ఈ కెమికల్‌ 80 శాతం ఆపిల్స్‌లో ఉంటున్నట్లు వెల్లడయింది. ఈ కెమికల్‌ నైట్రోజన్‌తో కలిసినపుడు నైట్రోజమైన్స్‌ అనే కార్సినోజెన్స్‌ను విడుదల చేస్తుంది. అందుకే యురోపియన్‌ యూనియన్‌ డీపీఏను నిషేదించింది. ఆపిల్‌ జ్యూస్‌, సాస్‌ల్లోనూ డీపీఏ ఉన్నట్లు తేలింది.



స్ట్రాబెర్రీలు

సా్ట్రబెర్రీల సాగులో మిథైల్‌ బ్రొమైడ్‌, క్లోరోపిక్రిన్‌, టెలోన్‌ అనే రసాయనాలను సాధారణంగా వాడుతుంటారు. ఈ మూడు కేన్సర్‌, ఎదుగుదల లేకపోవడం, పిల్లల్లో హార్మోన్ల సమస్యలు రావడానికి కారణమవుతాయి. దీన్ని కూడా నిషేదించారు.





గ్రేప్స్‌

ఒక్క సింగిల్‌ గ్రేప్‌లో 15 రకాల పెస్టిసైడ్స్‌ ఉంటున్నట్లు తేలింది. ముఖ్యంగా క్లోరోపైరిఫాస్‌ అనే పెస్టిసైడ్‌ ఉంటున్నట్లు వెల్లడయింది. క్లోరోపైరిఫాస్‌ వల్ల దగ్గు, శ్వాసలో ఇబ్బంది, తలనొప్పి వంటివి వస్తాయి. దీర్ఘకాలంలో మెదడుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లల్లో మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.



పాలకూర

పాలకూర సాగులో ఎసిటామిప్రిడ్‌, ఇమిడాక్లోప్రిడ్‌ వాడకం ఎక్కువగా ఉంది. క్యాలీఫ్లవర్‌, క్యాబేజ్‌, బ్రొకోలి సాగులోనూ ఈ పెస్టిసైడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. నియోనికొటినైడ్స్‌ ఫ్యామిలీకి చెందిన ఈ రెండు పెస్టిసైడ్స్‌ను యూర్‌పలో నిషేదించారు. ఈ పెస్టిసైడ్స్‌ వల్ల పిల్లల్లో మెదడు ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.



క్యాప్సికం

ఇందులోనూ 15 రకాల పెస్టిసైడ్స్‌ ఉంటున్నట్లు తేలింది. న్యూరోటాక్సిక్‌ నియోనికొటినైడ్స్‌ ఉంటున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.



దోసకాయ

దోసకాయలో 86 రకాల పెస్టిసైడ్స్‌ ఉంటున్నట్లు వెల్లడయింది. హార్మోన్ల అసమతుల్యత, కార్సినోజెన్స్‌ విడుదలకు కారణమయ్యే న్యూరోటాక్సిన్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా కార్బండిజమ్‌ అనే ఫంగిసైడ్‌ కార్సినోజెన్స్‌ను విడుదల చేస్తోంది.


టొమాటో
పెస్టిసైడ్స్‌, ఫంగిసైడ్స్‌, ఎండోసల్ఫాన్‌ వంటి ఇన్‌సెక్టిసైడ్స్‌ వాడుతున్న పంట ఇది. దీనివల్ల సెంట్రల్‌ నర్వ్‌స సిస్టమ్‌ దెబ్బతినే అవకాశం ఉంది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top