హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో అమ్మ క్యారెక్టర్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. పాత సినిమాల్లోని అమ్మ క్యారెక్టర్లకు... ఇప్పటి క్యారెక్టర్లకు చాలా తేడా వచ్చింది. కేవలం వంటింటికే పరిమితమై.. కుటుంబ వ్యవహారాల్లో అంతగా జోక్యం చేసుకోని అమ్మలు ఆనాటి వారయితే.. హీరోలు, హీరోయిన్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తూ సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు ఈనాటి తల్లులు.. మరి పాత్రకున్న ప్రాధాన్యతకు తగ్గట్లుగానే వారి పారితోషికాలూ ఉన్నాయి. టాలీవుడ్‌లో నేటి తల్లులు.. వారి పారితోషికాల లెక్కోంటో చూద్దామా..
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత తల్లుల గురించి చెప్పాలంటే మొదటగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ గురించే. బాహుబలి, భల్లాలదేవ తల్లిగా... సినిమాలో ముఖ్య పాత్రను పోషించింది. ఆమె పారితోషికం రోజుకు రెండు లక్షల రూపాయలట. మిర్చి, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించిన నదియాకు కూడా రోజుకు రెండు లక్షలు ఇస్తున్నారట. బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో తల్లి పాత్రకుగానూ హేమమాలినికి 2కోట్ల రూపాయలు ముట్టచెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సినిమాలో ఈ పాత్ర అతి కీలకం కావడం వల్ల అంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పుకున్నారట. ఇక జయసుధకు సినిమాకు 10 నుంచి 12 రోజుల డేట్స్‌కు 20 లక్షల రూపాయలు.. ఆపైన అయితే రోజుకు లక్ష ఇస్తున్నారట. రేవతికి సినిమాకు 15 నుంచి 20 లక్షలు. అలా మొదలైంది.. జెంటిల్‌మెన్ సినిమాల్లో అమ్మ పాత్రలకు గానూ రోహిణికి రోజుకు 50 నుంచి 60 వేలు. మధుబాలకు రోజుకు 75వేలు, రాశికి రోజుకు 75వేలు, కళ్యాణ వైభోగమే సినిమాలో నటించిన ఐశ్వర్యకు 40 నుంచి 50 వేలు ఇస్తున్నారట. సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం సినిమాల్లో అమ్మగా నటించిన పవిత్రాలోకేష్‌కు రోజుకు 50 నుంచి 60 వేలు ఇచ్చారట. ప్రగతికి రోజుకు 40వేలు ఇచ్చారట.

Post a Comment
Thank U For ur Comments