స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను బాలీవుడ్ దర్శకుడు మోసం చేశాడట. మోసం చేసి హీరోతో ఆమెకు లిప్ లాక్ పెట్టించాడట. ఇదే అందరికీ చెప్పుకుని కాజల్ బాగా ఫీల్ అవుతోందట. మరి సీన్ తీసినప్పుడే ఎందుకు అడగలేదు అని అంటే.. సడెన్ గా అలా ముద్దు పెట్టేశారని, ఆ సీన్ తీసేయమని చెప్తే తీయకుండా దాన్ని విడుదల చేశారంటూ వాపోతోంది.
ఇంతకీ కాజల్ చెబుతోంది ఏ లిప్ లాక్ గురించి అంటే.. బాలీవుడ్ సినిమా 'దో లఫ్జోంకీ కహానీ'లో రణదీప్ హుడాకు జోడీగా కాజల్ నటిస్తోంది. ఇందులో ఓ ఎమోషనల్ సీన్ తీశాడట దర్శకుడు దీపక్ తిజోరి. అయితే సీన్ అయిపోయాక హీరోయిన్ ని హీరో దగ్గరికి తీసుకోవాలట. అంత వరకే కాజల్ కు చెప్పారట. కానీ రణదీప్ హుడా మాత్రం ఆ సీల్ లిప్ లాక్ చేశేశాడట. దీంతో
షాక్ అయిపోయిన కాజోల్ అలాగే ఉండిపోయిందట. కొద్ది సేపటికి షాక్ నుండి తేరుకుని సన్నివేశాన్ని తొలగించాలని దర్శకుడు దీపక్ తిజోరిని అడిగిందట. అయితే ఆ సీన్ ఇప్పుడు ట్రైలర్ లో పెట్టడంతో కాజల్ షాక్ అయ్యిందట. అందరికీ చెప్పుకుని బాధపడుతోందట.
అయితే కాజల్ చెప్పినట్లు అది సడెన్ గా చేసినట్లు ఏమీ లేదని, హీరోయిన్ కు చెప్పకుండా అలాంటి సీన్లు ప్లాన్ చేయడం అంటూ ఉందడని సినీ జనాలు అంటున్నారు. మరి కాజల్ ఎందుకిలా చెబుతుందో ఏంటో?
Post a Comment
Thank U For ur Comments