ఫుల్లుగా తాగేసి.. ఇంట్లో తెలియకుండా ఉండాలని మందుబాబులు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదేదో నములుతుంటారు. కొన్ని రకాల ద్రావణాలను నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటారు. అయితే ఏం చేసినా గానీ పళ్లు మాత్రం తోముకోవద్దంటున్నారు నిపుణులు. మద్యం తాగిన తర్వాత వాసన రాకుండా ఉండాలనే ప్రయత్నాల్లో భాగంగా పళ్లు తోముకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పళ్లకు ముప్పు వస్తుందనీ, దంతాల పటిష్టత తగ్గిపోతుందని చెబుతున్నారు. పళ్లపై ఉండే తెల్లటిరంగు (ఎనామిల్) కోల్పోయి పళ్లు పుచ్చిపోతాయంటున్నారు. మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుందనీ, తాగిన వెంటనే బ్రష్ చేసుకోవడం వల్ల ఆ ఆమ్లంతో పళ్లు తోముకున్నట్లయి... పళ్లు పుచ్చిపోయే ప్రమాదముందంటున్నారు.
Post a Comment
Thank U For ur Comments