ఎడారి అనగానే రాజస్థాన్ గుర్తొస్తుందా? కానీ ఇది రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి కాదు. కర్నాటకలో ఉన్న మినీ ఎడారి. కావేరి నది ఒడ్డున ఉంది. కర్నాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఉన్న తాలకాడ్‌ గ్రామం పూర్తిగా ఇసుకతో నిండి ఎడారిని తలపిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో 30 దేవాలయాలు ఉండేవట. అందులో శివుడి పంచ ముఖాలకు ప్రతీకగా ఐదు శివలింగాలు కూడా ఉన్నాయట! కానీ అవన్నీ ఇసుకులో కూరుకుపోయాయి. స్థానికుల కథనం ప్రకారం శివ భక్తురాలైన ఓ వితంతువు ఈ భూమిని శపించిందట! అప్పటినుంచి ఈ గ్రామం మొత్తం ఎడారిగా మారిందని చెబుతారు స్థానికులు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top