హైదరాబాద్‌: 'బ్రహ్మోత్సవం' చిత్ర ప్రచారంలో భాగంగా మహేష్‌బాబు చెప్పులు తొడుగుతున్నట్టుగా ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అయితే మహేష్‌ చెప్పులు తొడిగే వ్యక్తి ముఖాన్ని మాత్రం చూపించలేదు. దీంతో మహేష్‌ చెప్పులు తొడిగింది ఎవరికా? అంటూ ప్రశ్న మొదలైంది. అందరిలోనూ ఉత్కంఠను రేపిన ఆ పోస్టర్‌ ఆకట్టుకుంది కూడా. తాజాగా మహేష్‌ ఎవరి కాళ్లకు చెప్పులు తొడిగింది అనే ప్రశ్నకు జవాబు దొరికింది.
బ్రహ్మోత్సవంలో మహేష్‌ తండ్రిగా సత్యరాజ్‌ నటిస్తున్నారు. తండ్రికి చెప్పులు తొడిగి ఆశీర్వాదం తీసుకునే సన్నివేశమట అది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మన సూపర్‌స్టారే వెల్లడించారు. మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top