సందీప్ కిషన్ నటించిన "ఒక్క అమ్మాయి తప్ప" సినిమాకు సంబంధించిన ఓ విషయాన్ని ప్రముఖ ఛాయాగ్రహకులు చోటా కే నాయుడు చెప్పారు. తన మేనల్లుడు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం "ఒక్క అమ్మాయి తప్ప" చిత్రంలో హీరోయిన్ కోసం ఎంతమందిని అడిగినా ఒప్పుకోలేదట. టాలీవుడ్ లీడ్ హీరోయిన్లంతా కాదని చెప్పారట. 

దీనికి కారణం ఏంటి అంటే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా చిన్నది కావడంతో రకుల్ ప్రీత్ సింగ్ సహా చాలా మంది నో చెప్పారని చోటా తెలిపారు. అయితే నిత్యా మీనన్ మాత్రం క్యారెక్టర్ నచ్చింది కాబట్టి తప్పకుండా చేస్తాను అని చెప్పిందట. మొత్తంగా నిత్యామీనన్ మరోసారి తాను మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ అని అనిపించుకుంది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top