చిన్న అందమైనా చెదరని చిరునవ్వుతో ,అందరిని అలరిస్తూ ఉండే ఆల్లు అర్జున్ మెగా ఫాన్స్ అందరికి ఇష్టమైన హీరో .బన్నీ కి కూడా మెగా ఫామిలీలో అందరితో భాగుంటాడు.అల్లు అర్జున్ ఎప్పుడు ఎవ్వరితోను వైరం ఉన్నట్టు కనిపించలేదు.పైగా పవన్, అల్లు అర్జున్ మధ్య ముందు మునుపు ఇలాంటి సంగటన కూడా చూడలేదు. అయితే ఆ రోజు ఫున్క్షన్ లో పవన్ గురించి మాట్లాడమంటే ,చెప్పను బ్రదర్ అని అన్న మాట పవన్ ఫాన్స్ ని హర్ట్ చేసింది.
అయితే పోనీ అది ఎదో మాములుగా అని ఉంటాడు ,దానికి ఫాన్స్ అలా ఊహిన్చుకుంటున్నారేమో అనుకున్నా మళ్ళీ ఇంటర్వ్యూ లో పవన్ గురించి అడిగితే చెప్పను బ్రదర్ అని ట్విస్ట్ ఇచ్చాడు బన్నీ .ఎందుకు బన్నీ కి పవన్ పై కోపమని అందరు ఆశ్చర్యపడతున్నారు.సేలేబ్రేటీస్ కి ఎవరికీ ఎవరిమీద కోపం ఉన్నా వారి విమర్సాలలో కారణం స్పష్టమవుతుంది.కాని ఈ కామెంట్ లెస్ కోపం ఏంటి బన్ని?
ఆలోచించగా అందరిలో ఓ అనుమానం మొదలైంది.పవన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీ ఆర్ మరియు రామ్ చరణ్ ని పొగిడాడు.వాళ్ళిద్దరూ డాన్స్ బాగా చేస్తారని చెప్పాడు.దానికి బన్ని హర్ట్ అయ్యాడా?డాన్సులో టాలీవుడ్ ని మరియు మెగా ఫాన్స్ ని ఎప్పటికప్పుడు సాటిస్ఫై చేస్తూ వస్తుంటే తన మాటే ఎత్తకుండా ఉన్నప్పుడు ,పవన్ గురించి తనెందుకు మాట్లాడాలి అనుకున్నాడా? ఇంతే కాకుండా ప్రజారాజ్యం పార్టి నుంచి అల్లు వారి ఫ్యామిలీ తో పవన్ కి ఏమైనా వైరం ఉందా?దాని ప్రభావమేమైనా ఉండి ఉంటుందా?చెప్పను బ్రదర్ అన్న మాటకి ,పవన్ ఫాన్స్ అల్లు అర్జున్ ని కామెంట్ చెయ్యడం మరియు బన్ని ఫాన్స్ పవన్ ని కామెంట్ చేస్తున్నారు తప్పితే పవన్ నుంచి ఎలాంటి కామెంట్ లేదు .అలా ఆలోచిస్తే అసలు వారిద్దరి మధ్య ఏ వైరం లేకపోవచ్చని అంటున్నారు.ఏది ఏమైనా ఇద్దరు మెగా హీరోలు ,మెగా స్టార్ చిరంజీవికి కావాల్సిన వారు.
చిరు నాటిన ఈ మొక్కలన్నీ ఎదిగి పెద్ద వ్రుక్షాలై ,మన అందరికి ఎంటర్టైన్మెంట్ అనే చల్ల దానాన్ని ఇస్తూ కలసి మెలసి ఉండాలని కోరుకుందాం.
Post a Comment
Thank U For ur Comments
EmoticonClick to see the code!
To insert emoticon you must added at least one space before the code.