న్యూ ఢిల్లీ: ఏపీ నుంచి బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన ఏదీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే అంశంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సీఎంతో మాట్లాడారు. అయితే ప్రధాని మోదీ రాజ్యసభ ప్రస్తావన తేలేదని ఆమెకు బదులిచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకే రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరితే ఏం చేస్తారని సీఎంను విలేకర్లు ప్రశ్నించగా ఇంకా ఆ విషయం ప్రస్తావనకు రాలేదు కదా అంటూ బదులిచ్చారు.
అయితే బీజేపీకి ఈసారి రాజ్యసభకు అకాడిమేట్ చేసే పరిస్థితి మాత్రం కనిపించట్లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని కేంద్రం తేల్చిచెప్పిన తరువాత కూడా బీజేపీ అభ్యర్థికే రాజ్యసభ సీటు ఇస్తే ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుందన్నఅభిప్రాయాన్ని కూడా కొందరు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.
ఈ అంశాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు బీజేపీకి ఈ సారి రాజ్యసభ సీటు ఇచ్చేది లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.? కాగా ఈనెల 19న పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎవరెవ్వరు..ఎక్కడ్నుంచి పోటీ చేయబోతున్నారన్న విషయం స్పష్టం కానుంది. ఒకవేళ నిర్మలా సీతారామన్‌కు రాజ్యసభ ఇవ్వకపోతే గతంలో మాదిరిగా అధికార ప్రతినిధిగా కొనసాగుతారని తెలిసింది.? ఇప్పటికే ఈ విషయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Post a Comment
Thank U For ur Comments