ముంబాయ్: ఐపిఎల్ నుంచి ఔట్ అయ్యే ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు బెంగుళూరు ఆటగాడు గేల్. బ్రిటీష్ న్యూష్ పేపర్‌కు చెందిన ఒక లేడీ జర్నలిస్ట్‌పై గేల్ చేసిన వ్యాఖ్యలకు సర్వాత్రా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అతను చేసిన కామెంట్లకు పర్యవసానంగా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ బిబిఎల్ నుంచి తొలగించబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపిఎల్ నుంచి కూడా తొలగించేందుకు యోచన చేస్తోంది ఐపిఎల్ మానేజ్‌మెంట్ బోర్డ్. ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ సోమర్సెట్ జట్టు నుంచి కూడా తొలగించాలని చూస్తోంది కౌంటీ క్లబ్ మానేజ్‌మెంట్.
ఈ విషయం గురించి ఐపిఎల్ ఛైర్మన్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు తమను తాము కంట్రోల్‌లో ఉంచుకోవాలని, నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. టోర్నమెంట్ జరుగుతున్నంత వరకూ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోవాల్సిందేనని తేల్చి చెప్పారాయన. ఐపిఎల్ పవిత్రతను చెడగొట్టకూడదంటూ ఆటగాళ్లందరికీ సూచించారు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ప్రసెడెంట్, సెక్రెటరీల దృష్టికి తీసుకుళ్తామని చెప్పారు శుక్లా.

గేల్ 2011 నుంచి ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఆడుతున్నాడు. గేల్ విషయాన్ని బెంగుళూరు జట్టు మేనేజ్‌మెంట్‌తో కూడా చర్చించనున్నట్టు శుక్లా తెలిపారు. గేల్ సంఘటనను ఇద్దరు విదేశీయులకు సంభందించిన వ్యక్తిగత విషయంగా తాము చూస్తున్నామని, అంతమాత్రానా దాన్ని లైట్ తీసుకున్నట్టు కాదని బీసీసీఐ సెక్రెటరీ అజయ్ తెలిపారు. తమ వద్దకు ఫిర్యాదు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. ఇలా జర్నలిస్ట్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గేల్‌కిదే మొదటిసారి కాదు. అంతకుముందు బిగ్ బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియన్ లేడీ రిపోర్టర్‌ను డోన్ట్ బ్లష్ బేబీ అని వ్యాఖ్యానించి వార్లల్లో నిలిచాడు క్రిస్ గేల్.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top