పాలు.. చిన్నారుల అలకను తీర్చేది. పెద్దల అవసరాన్ని తీర్చేది. దేవుళ్ల అభిషేకానికి ఉపయోగించేది. మరి ఈ పాలను వీళ్లు ఇలా పారబోస్తున్నారేంటి. వాటితో రోడ్డుపై స్నానం చేస్తున్నాడేంటనుకుంటున్నారా..? వాళ్ల కోపాలే ఆ పనికి కారణమయ్యాయి. వాళ్లంతా పాల రైతులు. ఎప్పుడూ తమ నుంచి పాలు సేకరించే ఒడిసా పాల సమాఖ్య.. 

ఈ మధ్య తమను సరిగా పట్టించుకోవడం లేదని ఆ రైతులు భావించారు. పాలను తమ వద్ద నుంచి సేకరించకుండా తమ పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రోడ్లపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో బారాగఢ్ జాతీయ రహదారిపై 30వేల లీటర్ల పాలతో వెళ్తున్న ఓ ట్యాంకర్ వాళ్ల కంటపడింది. కడుపు మండి ఉన్న ఆ రైతులు ట్యాంకర్‌ను అడ్డగించి ఆ పాలను నేలపాలు చేశారు. ఆ సందర్భంలోనే ఓ రైతు వాటితో స్నానం చేశాడు. 

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top