టాలీవుడ్ అందగత్తెలు కాజల్ అగర్వాల్ - సమంతలు బ్రహ్మోత్సవంలో కలిసి నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి.. ఒకే ఫ్రేమ్ లో వీరిద్దరినీ కలిసి చూడాలన్న ఆసక్తి పెరిగిపోయింది. అప్పుడెప్పుడో జూనియర్ ఎన్టీఆర్ బృందావనంలో కలిసి నటించినప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే మొదలు.
బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ సందర్భంగా.. కాజల్ పేరును సమంత చెప్పి శుభాకాంక్షలు తెలిపినా... శామ్స్ పేరును చందమామ చెప్పలేదు. పైగా ట్విట్టర్ లో కూడా తను నటించిన పాటలు తప్ప.. మిగిలిన సాంగ్స్ ను ట్వీట్ చేయలేదు కాజల్. దీంతో వీరిద్దరి మధ్య ఏవే తేడాలు ఉన్నాయనే టాక్ మొదలైపోయింది. వీళ్లిద్దరూ కలిసి నటించిన రెండు సినిమాల మధ్య గ్యాప్ లో.. వారి స్థాయి దాదాపు రివర్స్ అయిపోవడంతోనే ఇదంతా అన్నారు. కానీ ఇలాంటి కామెంట్స్ కు చెక్ చెబుతూ మొత్తానికి సమంత కాజల్ లు కలిసి ఒక చోట కలిసి కనిపించారు.
మహేష్ చెప్పులు తొడుగుతున్న ఫోటోను పెట్టుకుని ఓ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీకి సంబంధించిన ఈవెంట్ లో ఈ ముద్దుగుమ్మలిద్దరూ సందడి చేశారు. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండడంతో.. కాజల్ సమంతల మధ్య తేడాలు అనే కామెంట్స్ అన్నీ రూమర్స్ అని తేలిపోయినట్లు చెప్పాల్సిందే.
Post a Comment
Thank U For ur Comments