
ఆగస్టు రిలీజ్ టార్గెట్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' షూటింగ్ జోరుగా సాగుతోంది. మరోవైపు తన నెక్స్ట్ మూవీ కోసం ఓ డిఫరెంట్ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడట యంగ్ టైగర్. తనతో సినిమా చేయాలని చూస్తున్న మాస్ డైరెక్టర్స్‌ను కాదని.. మాటల మాంత్రికుడికి ఛాన్స్ ఇస్తున్నాడట ఎన్టీఆర్. అతి త్వరలో "అ..ఆ.." సినిమాను ప్రేక్షకుల ముందుకుతెస్తున్న త్రివిక్రమ్… ఎన్టీఆర్ కోసం ఓ స్టోరీ సిద్ధం చేశాడట.
ఎన్టీఆర్‌కు కూడా ఈ స్టోరీ నచ్చేయడంతో త్రివిక్రమ్‌తోనే తన నెక్స్ట్ మూవీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో 'దమ్ము' చిత్రాన్ని నిర్మించిన కె.ఎస్.రామారావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ టేకప్ చేయనున్నారని సమాచారం.
మరి ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే..! గత ఏడాది నుంచే వీరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Post a Comment
Thank U For ur Comments