మతిస్థిమితం లేక అఘాయిత్యం
ఆదోని రూరల్, మే 12: కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో ఒకటో తరగతి చదువుతున్న జి.మోహన్(6)ను అతడి మేనమామ జి.వీరేష్ గురువారం హత్య చేశాడు. కూలీనాలీ చేసుకునే శ్రీరాములు, నాగవేణి దంపతుల రెండో కుమారుడు మోహన్. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో మోహన్ ఇంటి దగ్గరే ఉన్నాడు. మతిస్థితమితం లేని వీరేష్ (26) గోళ్లు కత్తిరించుకోవడానికి బ్లేడు కొనుక్కుంటానని తన తల్లి వద్ద రెండు రూపాయలు తీసుకుని బ్లేడు కొనుక్కొన్నాడు. అయితే ఊరు పక్కనే ఉన్న పొలానికి వీరేష్ వెళ్తుండగా.. ఇంటి వద్ద ఉన్న మోహన్ తాను వస్తానంటూ వెంట వెళ్లాడు.
పొలంలో మతిస్థిమితం కోల్పోయిన వీరేష్ అదే బ్లేడుతో మేనల్లుడిని గొంతు కోసి రక్తపు మడుగుల్లో ఉన్న మోహన్ పక్కనే కూర్చున్నాడు. గ్రామస్థులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వీరే్‌షను స్థానికులు పోలీసులకు అప్పగించారు.

Post a Comment
Thank U For ur Comments