
టోక్యో: ఒక్కో మనిషికి ఒక్కో ఇష్టం ఉంటుంది. కొందరికి సినిమాలంటే ఇష్టం. ఇంకొంతమందికి డ్యాన్సంటే ఇష్టం. మరికొంతమందికి ఒంటరితనం అంటే ఇష్టం. ఇష్టానికి కూడా ఓ హద్దు ఉంటుంది. అదే ఇష్టం హద్దు దాటిపోతే దాన్ని వెర్రి, పిచ్చి అంటారు. టోక్యోలో అలా వెర్రెత్తిపోయిన ఓ దొంగ ఏం దొంగతనం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే. హొన్మా అనే ఓ దొంగ స్త్రీలు ధరించే లోదుస్తులు దొంగతనం చేశాడు. 12 బ్రాలు, లోదుస్తులతో అతని పారిపోతుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. అయితే అతడిని ఆరా తీయగా అసలు విషయం తెలిసి పోలీసులకు మతిపోయింది. అతను దొంగ కాదు. కేవలం స్త్రీల పట్ల వ్యామోహంతో వారి లోదుస్తులు దొంగిలించి వాటితో తన కామవాంఛ తీర్చుకునేవాడట. అతడి ఇంట్లో 200 బ్రాలు, ప్యాంటీస్ చూసిన పోలీసులు చీచీ వీడికి ఇదేం పాడు బుద్ధి అనుకుంటూ ఆ దొంగకు దేహశుద్ధి చేశారు. అయితే ఈ రకం వ్యక్తి ఇతనొక్కడే కాదు. గత నెలలో పాబ్లో అనే దొంగ 1000 లోదుస్తులను దొంగిలించి పోలీసులకు దొరికిపోయాడు. పిచ్చి ముదిరితే ఇలాంటి పనులే చేస్తారంటూ స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
Post a Comment
Thank U For ur Comments