''మెదడు పాదరసంలా పని చేయాలి.. సూక్ష్మబుద్ధి ఉండాలి.. అప్పుడే పైకొస్తావ్‌..'' ఇలాంటి మాటలు తల్లిదండ్రులు అనడమూ.. యువత చెవిన పడటమూ కామనే. ఏం చేస్తే మెదడు పాదరసంలా పనిచేస్తుందనేగా మీ డౌటు. అయితే ఇలా చేసి చూడండి.

కొందరుంటారు.. ఏదైనా ప్రాబ్లమ్‌ ఆన్సర్‌ రాకుండా మొండికేస్తే.. దీని అంతు తేల్చే వరకు విశ్రమించేది లేదని గంటలకు గంటలు దాంతో కుస్తీ పడుతుంటారు. ఒకే పనిని అదేపనిగా చేయడం వల్ల బ్రెయిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని ఫ్రెష్‌గా మరోసారి ప్రయత్నించండి. మొదటి ప్రయత్నంలోనే మీరు సక్సెస్‌ అవుతారు. మెదడుపై ఒత్తిడి పెంచడం వల్ల జ్ఞానం పెరగదు సరికదా.. ఉన్న జ్ఞానం కూడా అవసరానికి అక్కరకు రాకుండా పోతుంది.

ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టడం వల్ల సబ్జెక్ట్‌ వస్తుందేమో గానీ, నాలెడ్జ్‌ రాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఒకసారి చదవినా విషయం బుర్రకెక్కుతుంది. ఇందుకుగాను ఉదయం వ్యాయామం చేయడం, ప్రకృతికి సంబంధించిన చిత్రాలు చూడటం వంటివి చేయాలి.

పాటలు పాడితే అదేదో నేరం అన్నట్టుగా భావిస్తారు కొందరు. నచ్చిన పాటను హమ్‌ చేయడం వల్ల మనసు రిలాక్స్‌ అవుతుంది. తద్వారా మెదడు కూడా చురుకుగా తయారవుతుంది. అందుకే తీరిక వేళల్లో ఓ సాంగేసుకోండి.

ఆటలాడటమూ మెదడును చురుకుగా ఉంచుతుంది. వీడియోగేమ్స్‌ ఆడటం వల్ల లాజికల్‌ థింకింగ్‌ అలవాటు అవుతుంది.

నలుగురితో మాట్లాడటం, వారితో మీ భావాలను పంచుకోవడం వల్ల కూడా ఆత్మారాముడు సంతృప్తి చెందుతాడు. దీని ప్రభావం మీ మానసిక స్థితిపై అలాగే మీ మేధస్సుపై సానుకూలంగా పనిచేస్తుంది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top