తను చేస్తున్న తాజా చిత్రం తని ఒరువన్ రీమేక్ కోసం…తన లుక్ మరియు ఫిజిక్ విషయంలో మార్పులు చూపించేందుకు రామ్ చరణ్ పూర్తి స్దాయిలో డిసైడ్ అయ్యాడు. అందుకోసమే చరణ్ తన వెర్షన్ షూటింగ్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు. బాలీవుడ్ నుంచి స్పెషలిస్ట్ లను పిలిపించి మరీ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం.
ఇప్పటికే చరణ్ కి హార్స్ రైడింగ్ విషయంలో మంచి ప్రావీణ్యత ఉన్నా మరింత డిఫరెంట్ గా కనిపించడం కోసం ఈ ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా డిఫరెంట్ స్టైల్ లో స్టంట్స్ చేయడంలో ట్రైనప్ అవుతున్నాడట. అలాగే అథ్లెటిక్ బాడీ కోసం కూడా ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ఓ వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తాను చేసేది చాలా టఫ్ రోల్ కావడంతో పాత్రకు తగిన విధంగా తయారయ్యేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా రోజూ గంటల తరబడి హార్స్ రైడింగ్, సైక్లింగ్ చేస్తున్నారు. సినిమాలో పాత్ర కోసం రామ్ చరణ్ కాస్త బరువు కూడా తగ్గాల్సి ఉందని, అందుకోసం చాలా కష్టపడుతున్నాడని రామ్ చరణ్ స్పోక్ పర్సన్ తెలిపారు. ఇక ఈ సినిమా కోసం సన్నగా కనిపించేలా తన ఫిజిక్ మార్చుకుంటున్నాడని చరణ్ సన్నిహితులు అంటున్నారు. అంతేనా ఈసినిమాలో చరణ్ హెయిర్ స్టైల్ చాల డిఫరెంట్ గా ఉండబోతోంది అని టాక్.
Post a Comment
Thank U For ur Comments