ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని బాధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు చాలా మంది. నోరు కట్టేసుకోవడంతోపాటు గంటల తరబడి వ్యాయామం చేసినా ఒక్క కిలో బరువు కూడా తగ్గదు. ఇలా బరువు తగ్గకపోవడానికి అసలైన కారణాన్ని వైద్యులు కనుగొన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోవడానికి అసలు కారణం 'ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌'.




ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ అంటే ఇన్సులిన్‌కు శరీరం తగిన విధంగా స్పందించకపోవడం. మనం తిన్న ఆహారం గ్లూకోజ్‌గా మారుతుందన్న విషయం తెలిసిందే. అలా మారిన గ్లూకోజ్‌ రక్తంలో ఎక్కువగా ఉండిపోతే 'పాంక్రియాస్‌' అనే గ్రంథి ఇన్సులిన్‌ను విడుదల చేసి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. అయితే అధిక స్థాయిలో కార్బోహైడ్రేట్‌ ఆహారం తీసుకోవడం, శారీరకంగా శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల ఇన్సులిన్‌ ప్రభావవంతంగా పనిచేయలేదు. అప్పుడు శరీరం మరింత ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇలా అధిక స్థాయిలో విడుదలైన ఇన్సులిన్‌ కొవ్వు కరగడాన్ని నిరోధిస్తుందట. దీని వల్ల ఓ వ్యక్తి ఎంత వ్యాయామం చేస్తున్నా, తిండి తగ్గించినా ఫిజికల్‌గా మాత్రం బరువు తగ్గడం ఉండదట. అలాగే శరీరంలో వెంటవెంటనే గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ స్థాయిలు మారడం కూడా అధిక బరువుకు కారణమవుతుందట. ఎంత ఎక్కువగా కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం తీసుకుంటే శరీరం అంత ఎక్కువగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుందట. కాబట్టి ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను అరికట్టాలంటే లో గ్లెసిమక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారం తీసుకోవాలట.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top