సినిమాటొగ్రఫీ నుండి దర్శకత్వం వైపు టర్న్ తీసుకుని 'నువ్వు నేను', 'జయం' లాంటి హిట్స్ అందుకున్న తేజకి గత కొంతకాలంగా అన్నీ పరాజయాలే ఎదరురవుతున్నాయి. అతడి సినిమాల ద్వారా పరిచయమైన నటులు నేడు స్టార్ హోదా తెచ్చకున్న ఇతగాడు మాత్రం అక్కడే ఆగిపయాడు. తనకున్న అగ్రెసివ్‌నెస్ కారణంగా స్టార్లతో సినిమాలు చేయడం కుదరదని ఎన్నో సార్లు సభాముఖంగా చెప్పుకొచ్చిన తేజ తాజాగా ఓ ఇద్దరు స్టార్లతో సినిమా చేస్తుండటం విశేషం. (అప్పటికి సూపర్ స్టార్ కాకపోయినా స్టార్ హీరో వారసుడైన మహేశ్‌బాబుతో తేజ చేసిన ఏకైక సినిమా 'నిజం'.) తొలుత రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయాలనుకున్నా కొన్ని కారణాలతో ఆ సినిమా నుండి తప్పుకున్నారు ఈ మాజీ యాంగ్రీ యంగ్ మ్యాన్. దాంతో తను పరిచయం చేసిన ప్రస్తుత స్టార్ హీరోయిన్ కాజల్, బాహుబలితో బోలెడంత ఖ్యాతి సంపాదించిన రానా హీరో హీరోయిన్లుగా ఓ సినిమాకి శ్రీకారం చుట్టాడు తేజ. అంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసినట్టేగా..!

Post a Comment
Thank U For ur Comments