చాలామందికి నైట్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. రాత్రి వేళల్లో ఖాళీ రోడ్లపై కారులో రయ్‌రయ్‌మని దూసుకుపోవాలని కోరుకునే ఔత్సాహికులు ఉంటారు. కొంతమంది వీకెండ్‌లో తమ ముచ్చటను తీర్చుకుంటుంటారు. అయితే మరికొంత మందికి రాత్రివేళల్లో అడవి మార్గంలో ప్రయాణించడమంటే ఇష్టం. దట్టమైన అడవుల మధ్య రైడింగ్ చేస్తే వచ్చే కిక్కేవేరని వారు భావిస్తుంటారు. కానీ ఆ సరదా ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఆస్ట్రేలియాలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. రాత్రి వేళలో ఓ ఔత్సాహికుడు తన వ్యాన్‌కు డ్యాష్‌క్యామ్‌ను అమర్చి ఓ దుర్భేద్యమైన మార్గంలో రైడ్‌కు వెళ్లాడు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత అనుకోని ఘటన జరిగింది. దీంతో అతను ఒక్కసారిగా కంగు తిన్నాడు. అతను అలర్ట్‌గా లేకపోతే ప్రాణాలే పోయేవి. వేగంగా డ్రైవ్ చేస్తూ వెళుతుండగా ఒక్కసారిగా కంగారు వ్యాన్‌పైకి అమాంతం దూకింది. ఈ ఘటనలో వ్యాన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. అతను ఆగకుండా ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం తప్పింది.
Video 📼 Here
https://m.youtube.com/watch?v=YYGPFpqD90w
Source: AndhraJyoti
Video 📼 Here
https://m.youtube.com/watch?v=YYGPFpqD90w
Source: AndhraJyoti
Post a Comment
Thank U For ur Comments
EmoticonClick to see the code!
To insert emoticon you must added at least one space before the code.