ప్రపంచం మొత్తం ఒక్క నిమిషం ఇంటర్నెట్ నిలిచిపోతే పరిస్థితి ఏంటి ? వ్యవస్థలన్నీ అల్లకల్లోలమవుతాయా ? సోషల్ మీడియా సేవల్లో అంతరాయం కలిగితే దాని ఫలితం ఎలా ఉంటుంది ? ఇవన్నీ జరుగుతాయో లేదో తెలియదు కానీ బ్రెజిల్ దేశంలో కోర్టు ఆదేశాలతో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో దాదాపు 100 మిలియన్ల మంది వాట్సప్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజుల పాటు వాట్పప్‌ను బంద్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఎందుకీ ఆదేశాలు జారీ చేసిందో తెలియడం లేదు. న్యాయపరమైన భద్రతా కారణాల వల్ల ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
Post a Comment
Thank U For ur Comments