స్నేక్ గ్యాంగ్.. అత్యంత వికృతమైన నేరాలకు పాల్పడే ముఠా ఇది. రెండేళ్ల కిందట… హైదరాబాద్ నగరాన్ని వణికించిన క్రైమ్ ఇది. సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో ఇవాళ తీర్పు వెలువరించనుంది రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం.
పాతబస్తీకి చెందిన స్నేక్ గ్యాంగ్ ఓ యువతిని పాములతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. స్నేక్ గ్యాంగ్ పై 2014 జూలై 31న కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. దాదాపు రెండేళ్ల పాటు.. కేసులో వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ ఉదయం జడ్జిమెంట్ ఇవ్వనుంది.
స్నేక్ గ్యాంగ్ కేసులో మొత్తం 9మంది నిందితులున్నారు. ప్రధాన నిందితుడు… స్నేక్ గ్యాంగ్ సూత్రధారి అయిన ఫైజల్ దయానీని…. ఏ1 గా నమోదు చేశారు పోలీసులు. హైదర్ బారక్ భా, తయ్యబ్ భా సలామా, మహ్మద్ ఫర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం, అలీ బారక్ బా, సలాం హందీలు మిగతా ఎనిమిది మంది నిందితులు. వీరిలో.. ఆరుగురు జైల్లోనే ఉన్నారు. ముగ్గురు బెయిల్ పై రిలీజ్ అయ్యారు.
స్నేక్ గ్యాంగ్ అకృత్యాలను హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆధారాలు, వివరాలు సేకరించి.. పలుమార్లు నిందితులను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కేసులో మొత్తం 21 మంది సాక్షులను 13వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విచారణ చేశారు. పోలీసులు సమర్పించిన 39 సాక్ష్యాధారాలను పరిశీలించారు. రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాళ్టికి వాయిదావేసింది. నేరం రుజువైతే… నిందితులకు పదేళ్ల జైలు శిక్ష.. లేదా.. జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి.
Post a Comment
Thank U For ur Comments