🕉🔵OSRAJU@
14న టెన్త్ ఫలితాలు ?
తెలంగాణ: పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల14న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వీలయితే ఒకరోజు ముందుగానే అంటే 13న ఉదయమే ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 5,56,757 మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. గత ఏడాది మే మూడో వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. అయితే ఈసారి మాత్రం వారం ముందుగానే ఫలితాలు విడుదల చేయాలని ఎస్ఎస్సీ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
💥💥💥💥💥💥💥
🕉✳OSRAJU@
10న టీఎస్ఆర్జేసీ ప్రవేశపరీక్ష
తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల జూనియర్ కాలేజీలలో ప్రవేశాలకోసం ఈ నెల 10న టీఎస్ఆర్జేసీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. HTTP://TSRJDC.CGG.GOV.IN వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్ఆర్జేసీ కార్యదర్శి బీ శేషుకుమారి శుక్రవారం తెలిపారు. ఉదయం 9.30 గంటల వరకు సంబంధిత పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు హాజరుకావాలని ఆమె సూచించారు.
💥💥💥💥💥💥💥
🕉🅾OSRAJU@
12న ఈసెట్:
తెలంగాణ: ఇంజినీరింగ్ కాలేజీలలో లాటరల్ ఎంట్రి (సెకండియర్ ప్రవేశాలు) కోసం నిర్వహించనున్న కామన్ ప్రవేశ పరీక్ష (ఈసెట్)-2016 ఈ నెల 12న నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హాల్టిక్కెట్ల డౌన్లోడ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఈసెట్-2016 కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య పేర్కొన్నారు. 26,982 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
🕉🅾🅾✳✳🔵🔯🕉
Post a Comment
Thank U For ur Comments