ఇటీవల బెంగుళూరులో ఓ యువతిని రాత్రిపూట 10 గంటల సమయంలో నడిరోడ్డుపై నుండి బలవంతంగా ఎత్తుకుపోయిన సంఘటన, ఆ మరుసటి రోజు కేరళలో జిషా అనే బాలికను రేప్ చేసిన అనంతరం దారణంగా మర్డర్ చేసారు. ఈ సంఘటనలపై ప్రియమణి ట్విట్టర్ ద్వార స్పందించారు. మరో ట్రాజిక్ రేప్, మర్డర్ సంఘటన గరించి విని షాకయ్యాను, భయాందోళనకు గురయ్యాను. భారత దేశం మహిళలకు సురక్షితం అని భావించడం లేదు. బెంగుళూరులో జనసంచారం ఉన్న రోడ్డులో 10 గంటల ప్రాంతంలో ఓ అగంతకుడు మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లిపోయాడు. భారత దేశం మహిళలకు ఏ మాత్రం సురక్షితం కాదని భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు. పరిస్థితి ఇలానే కొనసాగితే పరిస్థితి ఏమిటి? భారత దేశంలోని మహిళలు, అమ్మాయిలందరినీ ప్రాధాయపడుతున్నాను… దయచేసి ఇండియా వదిలి ఎక్కడైతే మహిళలకు సురక్షితంగా ఉంటుందో అక్కడికి వెళ్లిపోండి అని ట్వీట్ చేసారు. అయితే ప్రియమణి ట్వీట్లు… దేశానికి వ్యతిరేకంగా ఉన్నానే విమర్శలు వచ్చాయి. కొంత మంది ప్రియమణికి ఘాటుగానే రిప్లై ఇచ్చారు. దీనిపై ప్రియమణి స్పందిస్తూ 'నాకు రిప్లై ఇస్తున్న వారు నా ట్వీట్స్ సరిగ్గా చదవండి. నేను దేశానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. నేను ఫీలింగ్ వెల్లడించాను. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి జరుగుతున్నపుడు దేశంలో మహిళలకు భద్రత ఏది? అని ప్రశ్నిస్తే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లా? అంటూ ప్రియమణి మండి పడ్డారు.
Post a Comment
Thank U For ur Comments