బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్,  కంగనా మధ్య గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ ఈ వివాదాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంలో ప్రూఫ్‌లు అంటూ తమ దగ్గర ఉన్న కొన్ని ఫోటోలను కూడా బయటకు రిలీజ్ చేశారు. అయితే కంగనా రిలీజ్ చేసిన ప్రూఫ్స్ అన్నీ ఫొటోషాప్ బాపతేనంటూ హృతిక్ మాజీ భార్య సుసానే తెలిపింది. దీంతో ఈ వివాదానికి కొంత తెరపడ్డట్టు అనిపించింది.


ఇటీవల సుసానే తన పిల్లలతో కలిసి అబ్రాడ్ టూర్ వేసింది. అక్కడికి హృతిక్ కూడా హాజరు కావడంతో మళ్ళీ వీరిరివురు కలవబోతున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన సుసానే 'నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. హృతిక్‌తో కలిసి జీవితం పంచుకోవడం అనేది జరగదు. కానీ మేం మంచి పేరెంట్స్ – మా తొలి ప్రాధాన్యం పిల్లలే' అంటూ సుసానే ఖాన్ ట్వీట్ చేసింది. దీంతో మాజీ భార్య భర్తలిద్దరు కలవనున్నారనే ప్రచారానికి కూడా తెరపడ్డట్టు అయింది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top