'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం అలా రిలీజైందో లేదో… ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తన తర్వాతి సినిమా ప్రారంభించారు పవన్ స్టార్. సినిమా ఒక్కసారి మొదలైందంటే మళ్లీ బిజీ బిజీ జీవితమే. ఇక షూటింగ్ మధ్యలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడం కష్టమే. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు దాదాపుగా పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడపాల్సిన పరిస్థితి.
ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం జూన్ నెలలో ప్రారంభం కాబోతోంది. సినిమా ప్రారంభం కావడానికి మరో నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈ గ్యాపులో ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేసారు పవర్ స్టార్. తన మూడో భార్య అన్నా లెజెనివా, కూతురు పోలెనాతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు రెండో భార్య రేణు దేశాయ్ ద్వారా కలిగిన సంతానం అకీరా, ఆద్యలను కూడా తీసుకెళ్తారా? అనేది తెలియదు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top