న్యూయార్క్: లాంగ్ ఐలండ్‌కు చెందిన సమంతా చిరిచెల్లా అనే 26 ఏళ్ల యువతి కాన్ ఎడ్‌లో 40 లక్షల రూపాయల జీతం గల ఉద్యోగంలో చేరడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. అయితే ఉద్యోగంలో చేరబోయే సమయానికి ఆమెకు సారీ చెప్పేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లో ఇద్దరు మహిళలు నగ్నంగా ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి యాజమాన్యానికి కనపడింది. ఆమె స్వలింగ సంపర్కురాలేమో అనే అనుమానంతో ఉద్యోగం ఇవ్వం పో అన్నారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన సమంత కోర్టు మెట్లు ఎక్కుతోంది. కళలా చూడాల్సిన ఫొటోను పోర్న్ అన్నట్లుగా చూస్తున్నారని, తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాదిస్తోంది. కోర్టులో గెలిచి ఉద్యోగం సంపాదించుకుంటుందో లేదో కానీ పబ్లిసిటీ మాత్రం విపరీతంగా కొట్టేసింది.
Post a Comment
Thank U For ur Comments